Share News

HMDA Project: హుస్సేన్‌సాగర్‌ చుట్టూ స్కైవాక్‌.. సైకిల్‌ ట్రాక్‌

ABN , Publish Date - Feb 08 , 2025 | 03:35 AM

హుస్సేన్‌సాగర్‌ చుట్టురా 10.5 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ స్కైవాక్‌, సైకిల్‌ ట్రాక్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇది జరిగితే అతిపెద్ద సైకిల్‌ ట్రాక్‌, స్కైవాక్‌ నిర్మాణం చేసిన నగరంగా హైదరాబాద్‌ నిలువనుంది.

HMDA Project: హుస్సేన్‌సాగర్‌ చుట్టూ స్కైవాక్‌.. సైకిల్‌ ట్రాక్‌

పదిన్నర కిలోమీటర్ల మేర నిర్మాణం

ఎలివేటెడ్‌ కారిడార్‌లో సాగర్‌కు సొబగులు

వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ప్రత్యేక జోన్లు

ట్రాక్‌ వెంట ఓపెన్‌ థియేటర్లు, ఫుడ్‌ కోర్టులు

సుమారు రూ.500 కోట్ల మేర వ్యయం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి7 (ఆంధ్రజ్యోతి): హుస్సేన్‌సాగర్‌ చుట్టురా స్కైవాక్‌, సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పర్యాటకులకు, సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు హెచ్‌ఎండీఏలోని హైదరాబాద్‌ అర్బన్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు ఆథారిటీ ప్రణాళికలు రూపకల్పన చేసింది. హుస్సేన్‌సాగర్‌ చుట్టురా 10.5 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ స్కైవాక్‌, సైకిల్‌ ట్రాక్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇది జరిగితే అతిపెద్ద సైకిల్‌ ట్రాక్‌, స్కైవాక్‌ నిర్మాణం చేసిన నగరంగా హైదరాబాద్‌ నిలువనుంది. హుస్సేన్‌సాగర్‌ చుట్టురా ఎన్టీఆర్‌ గార్డెన్‌, అంబేడ్కర్‌ విగ్రహం, నెక్లెస్‌ రోడ్డు, జలవిహార్‌, సంజీవయ్య పార్కు, సెయిలింగ్‌ క్లబ్‌, ఇందిరాపార్కు, రామకృష్ణ మఠం, లుంబినీ పార్కు, సచివాలయం తదితర ప్రాంతాలను కనెక్ట్‌ చేసేవిధంగా స్కైవాక్‌, సైకిల్‌ ట్రాక్‌కు అవసరమైన ప్రతిపాదనలు చేశారు. ఎంఎంటీఎస్‌ ప్రయాణికులు నెక్లె్‌సరోడ్‌ రైల్వేస్టేషన్‌, ఖైరతాబాద్‌ రైల్వేస్టేషన్‌, మెట్రోస్టేషన్లతో పాటు సంజీవయ్యపార్కు వద్ద గల జేమ్స్‌ స్ర్టీట్‌ రైల్వేస్టేషన్ల నుంచి ఎలివేటెడ్‌ ర్యాంప్‌లున్నాయి. ఆయా ప్రాంతాల్లో సైకిల్‌ ట్రాక్‌, స్కైవాక్‌లకు యాక్సెస్‌ పాయింట్లను ఇవ్వనున్నారు. 5.5మీటర్ల మేర వెడల్పుతో వచ్చే ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌లో 3.3మీటర్ల మేర సైకిల్‌ ట్రాక్‌ కోసం వినియోగించనుండగా, 2.2మీటర్లు స్కైవాక్‌ కోసం వినియోగించనున్నారు.


ట్రాక్‌ వెంట ఓపెన్‌ థియేటర్లు, ఫుడ్‌ కోర్టులు

హుస్సేన్‌సాగర్‌పై 10.5 కిలోమీటర్ల మార్గంలో వివిధ ప్రాంతాల్లో పాదచారులకు, సైక్లిస్టుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ఆయా మార్గాల్లో సైకిల్‌ స్టాండ్‌లను ఏర్పాటు చేసి అద్దె ప్రతిపాదికన సైకిళ్లను ఇవ్వనున్నారు. ఆయా మార్గాల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ప్రత్యేకంగా జోన్లుంటాయి. ఎలివేటెడ్‌ స్కైవాక్‌, సైకిల్‌ ట్రాక్‌ వెంట పలు ప్రాంతాల్లో ఫుడ్‌ కోర్టులు, ఓపెన్‌ థియేటర్లు, మినీ థియేటర్లతో పాటు ఆట విడుపు కోసం ప్రత్యేకంగా వివిధ రకాల స్పోర్ట్స్‌ ఎరీనాలకు అవకాశం కల్పించనున్నారు. సుమారు రూ.500కోట్ల మేరకు వ్యయం అవుతుందని, కేవలం ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.200కోట్ల నుంచి రూ.250కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనాలు వేశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం అనుమతిస్తే పూర్తిస్థాయిలో డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టును కన్సల్టెన్సీ ద్వారా సిద్ధం చేసే అవకాశాలున్నాయి. అయితే మోటారు రహిత పర్యావరణ హితమైన ప్రాజెక్టుగా ఎలివేటెడ్‌ సైకిల్‌ ట్రాక్‌, స్కైవాక్‌ కారిడార్‌ నిలుస్తుందని అధికారులు అంటున్నారు.


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 03:35 AM