Share News

Hyderabad: బీ అలర్ట్.. హైదరాబాద్‌లో కొత్త వైరస్ కలకలం..

ABN , Publish Date - Jan 31 , 2025 | 10:28 AM

హైదరాబాద్‌లో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో అలజడి సృష్టించిన జీబీఎస్ వైరస్ క్రమంగా హైదరాబాద్‌కు విస్తరించింది. తాజాగా..

Hyderabad: బీ అలర్ట్.. హైదరాబాద్‌లో కొత్త వైరస్ కలకలం..
GBS Virus

Hyderabad GBS Virus: మహారాష్ట్రలో జీబీఎస్( గులియన్ బారే సిండ్రోమ్) వైరస్‌ అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. సోలాపూర్‌ జిల్లాలో ఈ వైరస్ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. అంతేకాకుండా దాదాపు 70 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ రాష్ట్రంలో కలకలం రేపిన జీబీఎస్ వైరస్ క్రమంగా హైదరాబాద్‌కు విస్తరించింది. తాజాగా, సిద్దిపేట జిల్లా మహిళకు జీబీఎస్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆ బాధిత మహిళ కిమ్స్‌లో చికిత్స పొందుతుంది. హైదరాబాద్‌లో తొలి జీబీఎస్ వైరస్ నమోదు కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

అయితే, జీబీఎస్ అంటువ్యాధి కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. బాధితులకు సరైన చికిత్స అందిస్తే జీబీఎస్ నుండి కోలుకుంటారని చెబుతున్నారు. అయితే, దీని చికిత్స చాలా ఖరీదైందని.. రోగికి ఇచ్చే ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ ధర ఒక్కొక్కటి వేలల్లో ఉంటుందని చెబుతున్నారు.

జీబీఎస్ లక్షణాలు ఏంటంటే

  • ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం

  • కండరాలు బలహీనంగా మారడం

  • కడుపునొప్పి, జ్వరం వాంతులు

  • జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

  • విరేచనాల సమస్యలు

ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి అధికంగా ఉండాలి. ఎందుకంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఈ వైరస్ త్వరగా ఎటాక్ చేస్తుంది. ఈ వైరస్ వస్తే రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Updated Date - Jan 31 , 2025 | 10:29 AM