Bus Accident: మరో ప్రైవేట్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:50 PM
కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరువకముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేట దగ్గర న్యూ గో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.
హైదరాబాద్, అక్టోబర్ 25: కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరువకముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేట దగ్గర న్యూ గో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. న్యూ గో ఎలక్ట్రికల్ బస్సు మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.