Share News

Bandi Sanjay: ఎన్నికల కేసులో బండి సంజయ్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:13 AM

ఓ ఎన్నికల కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు ట్రయల్‌ కోర్టులో ప్రత్యక్ష హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.

Bandi Sanjay: ఎన్నికల కేసులో బండి సంజయ్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఓ ఎన్నికల కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు ట్రయల్‌ కోర్టులో ప్రత్యక్ష హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ముందస్తు అనుమతి లేకుండా ఆయన భారీ కాన్వాయ్‌తో మిర్యాలగూడ శెట్టిపాలెం వెళ్లడంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్‌ సహా మరో ఏడుగురిపై కేసు నమోదయింది.


ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం.. నాంపల్లి ఎంపీ, ఎమ్మెల్యే మేజిస్ట్రేటు కోర్టులో విచారణలో ఉన్న ఆ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.

Updated Date - Jun 24 , 2025 | 04:13 AM