Share News

High Court: జన్వాడ ఫాంహౌ్‌సపై డ్రోన్‌ కేసులో కౌంటర్‌ దాఖలు చేయండి

ABN , Publish Date - Mar 12 , 2025 | 03:33 AM

సీఎం రేవంత్‌రెడ్డి మల్కా జిగిరి పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నప్పుడు జన్వాడ ఫాంహౌ్‌సపై డ్రోన్‌ ఎగురవేసిన కేసులో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.

High Court: జన్వాడ ఫాంహౌ్‌సపై డ్రోన్‌ కేసులో కౌంటర్‌ దాఖలు చేయండి

  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

  • రేవంత్‌రెడ్డి క్వాష్‌ పిటిషన్‌పై విచారణ

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి మల్కా జిగిరి పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నప్పుడు జన్వాడ ఫాంహౌ్‌సపై డ్రోన్‌ ఎగురవేసిన కేసులో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. డ్రోన్‌ ఎగురవేతకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి 2020లో హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా మంగళవారం జస్టిస్‌ కె. లక్ష్మణ్‌ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌. నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై పెట్టిన సెక్షన్లకు జరిగిన నేరానికి సంబంధం లేదని తెలిపారు.


ఏడేళ్లలోపు శిక్షపడే నేరాలకు నోటీసులు ఇ వ్వాల్సి ఉండగా పోలీసులు అత్యుత్సాహంతో రేవంత్‌ను 18రోజులు జైల్లో పెట్టారని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తరఫున కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావుకు ఆదేశాలు జారీచేసింది. పోలీసులు రికార్డు చేసిన ఐదుగురు సాక్షుల వాంగ్మూలాలు, జన్వాడ ఫాంహౌస్‌ నిషేధిత ప్రాంతంలో లేదని నిరూపించేలా జీవో నెంబర్‌ 92ను సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా పడింది.

Updated Date - Mar 12 , 2025 | 03:33 AM