Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..
ABN , Publish Date - May 15 , 2025 | 08:36 AM
Heavy Rain: గత కొద్ది రోజుల నుంచి మండే ఎండలతో అల్లాడుతున్న జనానికి ఊరట లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడింది.
గత కొద్ది రోజుల నుంచి మండే ఎండలతో అల్లాడుతున్న జనానికి ఊరట లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో గురువారం భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్పేట్, గోల్కొండ, టోలిచౌకి, మెహిదీపట్నంలో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది.
12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటనలు చేసింది. తెలంగాణలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
Astrologer: శరీరంలో 15 ఆత్మలు ఉన్నాయంటే.. నువ్వెలా నమ్మావు తల్లి..
Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..