High Court: రివ్యూ పిటిషన్ తేలేవరకు పదోన్నతులు ఇవ్వొద్దు
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:59 AM
డివిజన్ బెంచ్‌లో పెండింగ్‌లో ఉన్న రివ్యూ పిటిషన్ తేలే వరకు ఎలాంటి పదోన్నతులు కల్పించరాదని ట్రాన్స్‌స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విద్యుత్ సంస్థలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
విద్యుత్ సంస్థలకు హైకోర్టు ఆదేశాలు
డివిజన్ బెంచ్‌లో పెండింగ్‌లో ఉన్న రివ్యూ పిటిషన్ తేలే వరకు ఎలాంటి పదోన్నతులు కల్పించరాదని ట్రాన్స్‌స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విద్యుత్ సంస్థలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఆవిర్భవించిన 2014 జూన్ 2 నుంచి సీనియారిటీని లెక్కించి, ఇప్పటి వరకు ఇచ్చిన పదోన్నతులను సమీక్షించి, తగిన విధంగా పదోన్నతులు కల్పించాలంటూ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, బీసీ, ఓసీ ఉద్యోగుల ఐకాస నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ సీనియారిటీతో సంబంధం లేకుండా తాత్కాలిక పద్ధతిలో షరతులతో కూడిన పదోన్నతులు ఇస్తున్నారని, ఫలితంగా పలువురు బీసీ, ఓసీ ఉద్యోగులు పదోన్నతులు రాక నష్టపోతున్నారని పేర్కొన్నారు. పదోన్నతులపై ఇప్పటికే రివ్యూ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున అది తేలేవరకు విద్యుత్ సంస్థల్లో ఎలాంటి ప్రమోషన్లు ఇవ్వరాదని ఉత్తర్వులు జారీ చేసింది.