High Court: కేబీఆర్ పార్కు చెట్ల నరికివేతపై కేంద్రం వివరణ కోరిన హైకోర్టు
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:28 AM
పర్యావరణపరంగా సున్నిత ప్రాంతమైన కేబీఆర్ పార్కు వద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం వేల సంఖ్యలో చెట్లను నరికేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది
పర్యావరణపరంగా సున్నిత ప్రాంతమైన కేబీఆర్ పార్కు వద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం వేల సంఖ్యలో చెట్లను నరికేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. జీవవైవిధ్య ప్రాంతమైన కేబీఆర్ పార్కు వద్ద వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్డీపీ)లో భాగంగా నిర్మించే ఫ్లైఓవర్ కోసం చెట్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ గతంలో కింగ్‌షుక్ నాగ్, కాజల్ మహేశ్వరి తదితరులు వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. సోమవారం వీటిపై చీఫ్ జస్టిస్ ఏకేసింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్లు దాఖలు చేసినందున కేంద్ర ప్రభుత్వం తన స్పందన తెలియజేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.