Harish Rao warns: ఆంక్షలతో నిరుద్యోగుల నిరసన ఆపలేరు
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:36 AM
మోసపూరిత హామీలు, నీ తప్పుడు ప్రచారంపై కడుపుమండిన విద్యార్థులు, నిరుద్యోగులు...
హైదరాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ‘‘మోసపూరిత హామీలు, నీ తప్పుడు ప్రచారంపై కడుపుమండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిేస్త అక్రమకేసులు పెడతావా? వారిలో రగులు తున్న నిరసన జ్వాలలను నీ ఆంక్షలతో, చల్లార్చలేరు రేవంత్’’ అంటూ హరీశ్ రావుహెచ్చరించారు. ఉస్మానియాకు సీఎంవస్తున్న సందర్భంగా విద్యార్థుల ముందస్తుఅరెస్టులు అప్రజాస్వామికమని, వారిని విడుదలచేయాలని సోమవారం ఎక్స్‌వేదికగా ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులపై లాఠీలు ఝళిపించేందుకేనా.. విద్యాశాఖను, హోంశాఖను మీవద్ద పెట్టుకున్నదని సీఎంను ప్రశ్నించారు. ఉస్మానియా సాక్షిగా విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని రేవంత్‌రెడ్డిని హరీశ్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News