Share News

Harish Rao: పంచాయతీలకు పెండింగ్‌ నిధులు ఇవ్వండి

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:18 AM

మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు పెండింగ్‌ బిల్లుల చెల్లింపుతో పాటు పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్కకు ఆదివారం హరీశ్‌రావు లేఖ రాశారు.

Harish Rao: పంచాయతీలకు పెండింగ్‌ నిధులు ఇవ్వండి

  • మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు పెండింగ్‌ బిల్లుల చెల్లింపుతో పాటు పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్కకు ఆదివారం హరీశ్‌రావు లేఖ రాశారు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయి, పారిశుధ్యం పడకేసిందని తెలిపారు. చేసిన పనులకు బిల్లులు రాక మాజీ సర్పంచ్‌లు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఆ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.


2019లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 9,350 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను నియమించిందని, వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించాలని, పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 23 , 2025 | 04:18 AM