Harish Rao: గోదావరి నీళ్లను ఏపీ దోచుకుంటే ఊరుకోం
ABN , Publish Date - Jul 05 , 2025 | 04:31 AM
బనకచర్ల పేరిట గోదావరి నీళ్లను ఏపీ దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోం. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతాం. ఈ ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తాం’’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
నిరుద్యోగుల అరెస్టు అప్రజాస్వామికం: హరీశ్‌రావు
‘‘బనకచర్ల పేరిట గోదావరి నీళ్లను ఏపీ దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోం. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతాం. ఈ ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తాం’’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎ్‌సకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల వంటి అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 20ఏళ్ల కిందట ఇదే రోజున (2005 జూలై 4న) మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని గుర్తు చేశారు.
‘‘పదవులకు రాజీనామాలు చేయడం మాత్రమే కాదు.. పేగులు తెగే దాకా కొట్లాడతాం. తెలంగాణకు అన్యాయం జరగకుండా కాపలా ఉంటూ.. కంటికి రెప్పలా కాపాడుకుంటాం’’ అని పేర్కొన్నారు. చలో సచివాలయం కార్యక్రమానికి పిలుపునిచ్చిన నిరుద్యోగులు, విద్యార్థిసంఘాల నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.