Harish Rao: కోలుకున్న హరీశ్‌రావు
ABN , Publish Date - Jun 18 , 2025 | 04:15 AM
వైరల్ ఫీవర్‌తో ‘కిమ్స్ సన్‌షైన్’ ఆస్పత్రిలో చేరిన బీఆర్‌ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు కోలుకోవడంతో డిశ్చార్జి అయ్యారు.
కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
హైదరాబాద్ సిటీ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : వైరల్ ఫీవర్‌తో ‘కిమ్స్ సన్‌షైన్’ ఆస్పత్రిలో చేరిన బీఆర్‌ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు కోలుకోవడంతో డిశ్చార్జి అయ్యారు. స్వల్ప అస్వస్థతతో సోమవారం సాయంత్రం ఆయన బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. హరీశ్‌రావు ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు ఆయన్ను మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు డిశ్చార్జి చేశారు.
కాగా మంగళవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హరీశ్‌రావును బీఆర్‌ఎస్ నేతలు వద్దిరాజు రవిచంద్ర, సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, రవీందర్ తక్కళ్లపల్లి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు.