Medigadda Barrage: కాళేశ్వరం మంటలు
ABN , Publish Date - Jun 08 , 2025 | 04:56 AM
మేడిగడ్డ కుంగుబాటుపై కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల మంటలు రాజేశాయి! కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి క్యాబినెట్ ఆమోదించిందని ఈటల అంటే.. తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు కూడా అదే మాట చెప్పారు
మేడిగడ్డ కుంగుబాటుపై కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల మంటలు రాజేశాయి! కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి క్యాబినెట్ ఆమోదించిందని ఈటల అంటే.. తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు కూడా అదే మాట చెప్పారు! అయితే, అందుకు క్యాబినెట్ ఆమోదం లేదని, అసలు ఆ విషయం క్యాబినెట్ ముందుకే రాలేదని అప్పటి, ఇప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇక, మేడిగడ్డపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో తాను, ఈటల, తుమ్మల ఉన్నామని హరీశ్ స్పష్టం చేశారు. విచారణ అనంతరం ఇదే విషయాన్ని ఈటల కూడా చెప్పారు. కానీ, అది అసలు మేడిగడ్డపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ కానే కాదని తాజాగా తుమ్మల ఖండించారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చిందని హరీశ్ అంటే.. అసలు అలా ఎప్పుడూ చెప్పలేదని మంత్రి ఉత్తమ్ తెలిపారు. మరోవైపు, ఈ అంశం ఇప్పుడు బీజేపీలోనూ కాకరేపింది. ఆ పార్టీ అగ్రనేతల ఆరోపణలకు విరుద్ధంగా ఈటల వ్యాఖ్యలు ఉన్నాయంటూ విమర్శలు చెలరేగాయి. దీనిపై బీజేపీ అధిష్ఠానానికి నివేదిక వెళ్లినట్లు సమాచారం!!
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..