Share News

గ్రామ పాలనాధికారుల ర్యాంకుల జాబితా విడుదల

ABN , Publish Date - May 31 , 2025 | 04:50 AM

గ్రామ పాలనాధికారుల(జీపీవో) ర్యాంకుల జాబితాను భూ పరిపాలన ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. 5,300 మంది పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోగా వారిలో 4,558 మంది ఈ నెల 25న పరీక్ష రాశారు.

గ్రామ పాలనాధికారుల ర్యాంకుల జాబితా విడుదల

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పాలనాధికారుల(జీపీవో) ర్యాంకుల జాబితాను భూ పరిపాలన ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. 5,300 మంది పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోగా వారిలో 4,558 మంది ఈ నెల 25న పరీక్ష రాశారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 3,550 మంది జాబితాను శుక్రవారం సీసీఎల్‌ఏ అధికారులు భూభారతి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు.


రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకర్‌గా అడ్డా మధు(హాల్‌టిక్కెట్‌ నంబరు 2532052) నిలిచారు. ఆ తర్వాతి ఐదు స్థానాల్లో షేక్‌ లతీఫ్‌ సాహెబ్‌, బి.ప్రవీణ్‌కుమార్‌, విజయ సోమిరెడ్డి, ఈదన్న రవీందర్‌ ఉన్నారు. అర్హులైన వారికి 2లోపు నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సీసీఎల్‌ఏ తెలిపింది. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి అభినందనలు తెలిపారు.

Updated Date - May 31 , 2025 | 04:50 AM