Share News

Kaleshwaram: దొంగలకు సద్దులు మోసినట్లుగా ఈటల తీరు

ABN , Publish Date - Jun 08 , 2025 | 06:36 AM

పాత బాస్‌ కేసీఆర్‌ రుణం తీర్చుకునేందుకు ఈటల కమిషన్‌ ముందు నిజాలు చెప్పలేదన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం అవినీతి నుంచి కేసీఆర్‌ను బయటపడేసేందుకు ఈటల ప్రయత్నించారని మండిపడ్డారు.

Kaleshwaram: దొంగలకు సద్దులు మోసినట్లుగా ఈటల తీరు

కాళేశ్వరం అవినీతి నుంచి కేసీఆర్‌ను తప్పించేందుకు యత్నించారు: ఆది శ్రీనివాస్‌

ఈటల.. మళ్లీ బీఆర్‌ఎ్‌సలోకి పోవాలని చూస్తున్నారు: మేడిపల్లి సత్యం

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం విచారణ కమిషన్‌ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఇచ్చిన వివరణ తీరు దొంగలకు సద్దులు మోసినట్లుగా ఉందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. పాత బాస్‌ కేసీఆర్‌ రుణం తీర్చుకునేందుకు ఈటల కమిషన్‌ ముందు నిజాలు చెప్పలేదన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం అవినీతి నుంచి కేసీఆర్‌ను బయటపడేసేందుకు ఈటల ప్రయత్నించారని మండిపడ్డారు. కమిషన్‌ ముందు ఈటల కాళేశ్వరం కమీషన్ల చిట్టా విప్పుతారని అంతా ఆశించారన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం కమిషన్‌ ముందు ఈటల అన్ని విషయాలు చెబుతారన్నారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్ర నేతలు చేసిన ఆరోపణలకు ఈటల ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేసీఆర్‌ అవినీతిని నిరూపించేందుకు ఈటలకు మంచి అవకాశం వచ్చినా వదిలేశారన్నారు. ఈటల ఇచ్చిన వివరణపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ స్పందించాలన్నారు. బీజేపీ నేతలు దాచాలని చూస్తున్నా దర్యాప్తులో నిజాలు తప్పకుండా బయటకు వస్తాయని చెప్పారు. ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందాలు కూడా బయటపడతాయన్నారు. బీజేపీలో అధ్యక్ష పదవి రావట్లేదని.. మళ్లీ బీఆర్‌ఎ్‌సలోకి ఈటల పోవాలని చూస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. ఈటలకు పాత బాస్‌ కేసీఆర్‌ మీద ప్రేమ పోలేదని.. విచారణ కమిషన్‌ ముందు ఆయన ఇచ్చిన వివరణతోనే స్పష్టమవుతోందన్నారు. విచారణ కమిషన్‌పై కేటీఆర్‌ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీశ్‌ విమర్శించారు. తెలంగాణ ఏర్పడక ముందు.. ఆ తర్వాత కల్వకుంట్ల కుటుంబం ఆస్తుల వివరాలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి ఆ పార్టీ నేతలు చేసిన ఆర్థిక దోపిడీ అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News


Updated Date - Jun 08 , 2025 | 06:36 AM