Minister Adluri: విద్యారంగానికి సర్కార్ ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:51 AM
రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు...
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో గురుకులాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ఆసి్‌ఫనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ, బాలుర వసతి గృహాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ.8.75 కోట్ల వ్యయంతో భవనాన్ని నిర్మించామని, ఇందులో 160 మంది విద్యార్థులకు ఆధునిక విద్యా, వసతి సదుపాయాలు అందిస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..