Share News

LRS Fee Rebate: జూన్‌ నెలాఖరుదాకా ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ!

ABN , Publish Date - Jun 01 , 2025 | 04:03 AM

లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) ఫీజుపై ఇస్తున్న 25శాతం రాయితీ పథకాన్ని జూన్‌ చివరి వరకు కొనసాగించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.

LRS Fee Rebate: జూన్‌ నెలాఖరుదాకా ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ!

  • అధికారుల ప్రాథమిక నిర్ణయం.. ఇదే చివరి అవకాశం!

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) ఫీజుపై ఇస్తున్న 25శాతం రాయితీ పథకాన్ని జూన్‌ చివరి వరకు కొనసాగించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. పురపాలక శాఖ ఉన్నతాధికారులు సెలవుల్లో ఉన్నందున ఇందుకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది.


మార్చి నుంచి మూడు నెలల పాటు రాయితీ ఇచ్చారు. అయితే మే నెల ఆదాయంలో ఆశించిన పురోగతి కనిపించలేదని క్షేత్ర స్థాయి అధికారులు చెబుతున్నారు. దీంతో జూన్‌ నెలాఖరు వరకు రాయితీ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - Jun 01 , 2025 | 04:03 AM