Medaram Jathara: మేడారం జాతరకు 150కోట్లు మంజూరు
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:46 AM
అతిపెద్ద గిరిజన వేడుక మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ప్రభుత్వం రూ.150 కోట్లను మంజూరు చేసింది.
2024 కంటే రూ.45 కోట్లు అదనం
2026 జనవరి 28-31వరకు జాతర
హైదరాబాద్, వరంగల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): అతిపెద్ద గిరిజన వేడుక మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ప్రభుత్వం రూ.150 కోట్లను మంజూరు చేసింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు సమ్మక్మ సారలమ్మ జాతర జరగనుంది. 2026 మహాజాతరకు సుమారు కోటిన్నర మందికి పైగా భక్తులు పాల్గొంటారనే అంచనా.
2024కంటే అదనంగా రూ.45కోట్లు పెంచడమే కాక 5 నెలల ముందే నిధులు విడుదల చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధుల విడుదలపై మంత్రి సీతక్క.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతోపాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.