Share News

Jishnu Dev Varma: చేనేత వారసత్వంగా ఇక్కత్‌ కళ

ABN , Publish Date - Jun 13 , 2025 | 04:30 AM

ఇక్కత్‌ చేనేత వారసత్వంగా వస్తున్న ఒక కళ అని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో పర్యటించిన ఆయన టూరిజం టెక్స్‌టైల్‌పార్కులో ఇక్కత్‌ ఉత్పత్తులను పరిశీలించారు.

Jishnu Dev Varma: చేనేత వారసత్వంగా ఇక్కత్‌ కళ

  • పోచంపల్లి కళాకారులను అభినందించిన గవర్నర్‌

యాదాద్రి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): ఇక్కత్‌ చేనేత వారసత్వంగా వస్తున్న ఒక కళ అని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో పర్యటించిన ఆయన టూరిజం టెక్స్‌టైల్‌పార్కులో ఇక్కత్‌ ఉత్పత్తులను పరిశీలించారు. చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్‌ ఉత్పత్తులు కళ మాత్రమే కాదని, చేనేత కళాకారుల ప్రతిభకు చిహ్నమని తెలిపారు.


పోచంపల్లి ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యంతో పాటు మార్కెటింగ్‌ తీసుకువచ్చేందుకు అహ్మదాబాద్‌లోని ఎన్‌ఐటీ, ఐఐటీ సహకారంతో స్థానిక నేత కార్మికులు కలిసి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కత్‌ నకిలీలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నేత కార్మికులకు నేతన్న రుణాల కింద రూ.5లక్షల చెక్కులను అందజేశారు. నేతన్న పొదుపు పథకం కింద జిల్లాకు రూ.2.15కోట్ల చెక్కును నేత కార్మికులకు అందజేశారు.

Updated Date - Jun 13 , 2025 | 04:30 AM