Share News

K. Ramakrishna Rao: సీఎస్‌ పదవీ కాలం మరో 3 నెలల పొడగింపు!

ABN , Publish Date - Aug 15 , 2025 | 03:58 AM

రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

K. Ramakrishna Rao: సీఎస్‌ పదవీ కాలం మరో 3 నెలల పొడగింపు!

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆయన పదవీ కాలాన్ని పొడిగించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు పదవీ కాలాన్ని పొడిగించాలంటూ కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాలశాఖ (డీఓపీటీ)కి లేఖ రాసినట్లు సమాచారం. నిజానికి రామకృష్ణారావు ఐఏఎస్‌ అధికారిగా ఈ నెల 31న పదవీ విరమణ చేయబోతున్నారు. అదే రోజు సీఎ్‌సగా ఆయన పదవీ కాలం ముగియనుంది.


ఈ ఏడాది ఏప్రిల్‌ 30న ఆయన రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. నాలుగు నెలల పాటే ఆయన ఈ పదవిలో కొనసాగారు. అందుకే ప్రభుత్వం మరో మూడు నెలల పాటు ఆయనకు పొడిగింపు ఇవ్వాలని యోచిస్తోంది.

Updated Date - Aug 15 , 2025 | 03:58 AM