Share News

Organ Transplantation: సర్కారు దవాఖానాల్లో అవయవ మార్పిడుల పెంపు

ABN , Publish Date - Jun 04 , 2025 | 04:49 AM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి సర్వీసులను విస్తరించేందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తోంది. గుజరాత్‌లోని గట్స్‌ అధ్యయన ఫలితాల ఆధారంగా తెలంగాణలోనూ ముంపు పెంచాలని వైద్యవిభాగం నిర్ణయించింది.

Organ Transplantation: సర్కారు దవాఖానాల్లో అవయవ మార్పిడుల పెంపు

ట్రాన్స్‌ప్లాంటేషన్లపై సర్కార్‌ నిర్ణయం

మూడు పెద్దాస్పత్రుల్లో ప్రత్యేక విభాగాలు

నిమ్స్‌, గాంధీ, ఉస్మానియాల్లో ఏర్పాటు

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పెద్దాస్పత్రుల్లో అవయవ మార్పిడులను పెంచాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం సర్కారు దవాఖానాల్లో ప్రత్యేక అవయవ మార్పిడి విభాగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా దవాఖానాల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. తొలుత ప్రత్యేక అవయవ మార్పిడి సర్జరీ విభాగాన్ని ఏర్పాటు చేసి, విభాగాధిపతిని నియమించనున్నారు. ఆ తర్వాత వాటిలో కనీసం ఐదారు పోస్టుగ్రాడ్యుయేట్‌ సీట్ల కోసం జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ)కి దరఖా స్తు చేయనున్నారు. దాంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జన్ల సంఖ్య పెరగనుంది. సర్కారు దవాఖానాల్లో అవయవ మార్పిడి ఎలా పెంచాలన్న అంశంపై ఇటీవలే రాష్ట్ర వైద్య అధికారు ల బృందం గుజరాత్‌లోని గట్స్‌ (గుజరాత్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సైన్సె్‌స)ను సందర్శించింది. అక్కడ అవయవ మార్పిడి, అలైడ్‌ సైన్సెస్‌, పీజీ సీట్లపై అధ్యయనం చేసింది. ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించింది. రాష్ట్రంలోనూ స్పెషల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖకు సిఫారసు చేసింది. ఈ మేరకు ఆ మూడు పెద్దాస్పత్రుల్లో అవయవ మార్పిడి విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.


అనుకున్న స్థాయిలో జరగని మార్పిడులు

ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడుల సంఖ్య అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఒక్క నిమ్స్‌లో మాత్రమే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు ఏటా 125 నుంచి 135 వరకు జరుగుతున్నాయి. మిగతా ఆస్పత్రుల్లో నామమాత్రంగానే ఈ సంఖ్య ఉంటోంది. అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో అవయవ మార్పిడులు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల్లో క్షతగాత్రులై ఆస్పత్రుల్లో చేరి.. చికిత్స చేసినా కోలుకోని కేసుల సంఖ్య కూడా సర్కారు దవాఖానాల్లోనే ఎక్కువగా ఉంటోంది. ఇటువంటి కేసులు ప్రైవేటుకు వస్తే.. ప్రమాదానికి గురైన బాధితుల కుటుంబ సభ్యులతో చర్చించి, వారి అనుమతితో బ్రెయిన్‌ డెడ్‌ డిక్లేర్‌ చేస్తున్నారు. అనంతరం అవయవాలు తీసి అవసరమైన వారికి మార్పిడి చేస్తున్నారు. బ్రెయిన్‌ డెడ్‌ డ్లికేర్‌ చేసిన కేసుల్లో ఒక అవయవం ‘జీవన్‌దాన్‌’కు వెళితే.. మిగతా అవయవాలు సంబంధిత ఆస్పత్రులకే చెందుతున్నాయి. ఆ ఆస్పత్రి తరఫున అవయవ మార్పిడి కోసం జీవన్‌దాన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారికి కేటాయిస్తున్నారు. వాస్తవానికి ప్ర మాద కేసులు తొలుత ప్రభుత్వ ఆస్పత్రులకే ఎక్కువగా వస్తుంటాయని, ఆ తర్వాత ప్రైవేటుకు వెళ్తుంటాయని ఓ వైద్యాధికారి తెలిపారు. సర్కారీ ఆస్పత్రుల్లో కూడా బ్రెయిన్‌ డెడ్‌ డిక్లరేషన్‌ చేస్తే.. అటువంటి కేసులతో వచ్చే ఆవయవాలన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆవయవ మార్పిడి కోసం జీవన్‌దాన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారికి దక్కుతాయని నిపుణులు చెబుతున్నారు.


ప్రైవేటులో రూ.10-15 లక్షలు..

అవయవ మార్పిడి చేయించుకోవాలంటే ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.లక్షల్లో ఖర్చు అవుతోంది. ఉదాహరణకు కిడ్నీ మార్పిడి లాంటి వాటికైతే హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వాటి స్థాయిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతోంది. అదే నిమ్స్‌లో అయితే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేస్తున్నారు. ప్రెవేటులో ఖర్చు తట్టుకోలేని మధ్యతరగతి, నిరుపేదలు సర్కారీ దవాఖానాల్లోనే జీవన్‌దాన్‌లో రిజిస్టర్‌ చేసుకుంటున్నారు. ప్రస్తుతం జీవన్‌దాన్‌లో అవయవాల కోసం మొత్తం 16,569 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. అందులో ఒక్క కిడ్నీ కోసమే 8,044 మంది, కాలేయం కోసం 7,521 మంది రిజిస్టర్‌ చేసుకోగా, మిగతా వాటిలో గుండె, ఊపిరితిత్తులు, నేత్ర, కోమ్లం (పాన్‌క్రియా్‌స) కోసం దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 2013 నుంచి నేటి వరకు మొత్తం 5,323 అవయవ మార్పిడులు జరిగాయి.

ఏమిటీ గట్స్‌

గుజరాత్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సైన్సెస్‌ (గట్స్‌) కేవలం అవయవమార్పిడి కోసమే ఏర్పాటైన సంస్థ. ప్రపంచంలోనే తొలిసారి అవయవ మార్పిడి, అలైడ్‌ సైన్సె్‌సకు సంబంధించి ఏర్పాటైంది. ఇంకా చెప్పాలంటే నెఫ్రాలజీలో వినూత్నమైన పరిశోధనలు, వైద్యవిద్య, పరిశోధనల సమాహారమే ఈ గట్స్‌. ప్రధానంగా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సైన్సె్‌సలో అయా రకాల కోర్సులను ఈ యూనివర్సిటీ ఆఫర్‌ చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 04:49 AM