‘గృహజ్యోతి’కి రూ.125.84 కోట్లు విడుదల
ABN , Publish Date - Jan 19 , 2025 | 04:15 AM
గృహజ్యోతి పథకం కోసం జనవరి నెలకిగాను రూ.125.84 కోట్లను విద్యుత్ సంస్థలకు విడుదల చేస్తూ
హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): గృహజ్యోతి పథకం కోసం జనవరి నెలకిగాను రూ.125.84 కోట్లను విద్యుత్ సంస్థలకు విడుదల చేస్తూ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం జీవో జారీ చేశారు. 200 యూనిట్ల దాకా వినియోగించే పేద వర్గాలకు ఈ పథకం ద్వారా ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్న విషయం విదితమే.