Share News

పాజెక్టుల గడువు పెంపునకు అనుమతి తప్పనిసరి

ABN , Publish Date - May 26 , 2025 | 04:50 AM

కొత్తగా చేపట్టనున్న, పాత ప్రాజెక్టులు నిర్దేశిత సమయంలో పూర్తి కాకుంటే సర్కారు ఆమోదం పొందిన తర్వాతే గడువు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ నిర్ణయించింది.

పాజెక్టుల గడువు పెంపునకు అనుమతి తప్పనిసరి

  • ఆర్‌ అండ్‌ బీ శాఖ నిర్ణయం

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): కొత్తగా చేపట్టనున్న, పాత ప్రాజెక్టులు నిర్దేశిత సమయంలో పూర్తి కాకుంటే సర్కారు ఆమోదం పొందిన తర్వాతే గడువు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ నిర్ణయించింది. ఆయా ప్రాజెక్టులు సమయానికి పూర్తి కాకుంటే.. వాటికి సంబంధించిన ఫైళ్లను ప్రభుత్వానికి సమర్పించాలని, ఆ ఫైళ్లు పరిశీలించి, ఆమోదించిన తర్వాతే గడువు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయాలని రోడ్లు, భవనాలశాఖలో అంతర్గతంగా జారీ చేసిన సర్క్యులర్‌.. తీవ్ర చర్చనీయాంశమైంది.


కాగా, ఎన్నడూ లేని ఈ నిబంధన తెర మీదకు తేవడం వల్ల కలిగే లాభ నష్టాలపై ప్రభుత్వానికి ఒకటి, రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని చీఫ్‌ఇంజినీర్ల కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేసినా.. ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రభుత్వానికి ప్రాజెక్టు పనుల పొడిగింపు ఫైల్స్‌ పంపితే, సమయానికి తిరిగి రాకపోగా, పనులు మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.

Updated Date - May 26 , 2025 | 04:50 AM