Bio Technology: బీటెక్ బయో టెక్నాలజీలో మరిన్ని సీట్లకు అనుమతి
ABN , Publish Date - Jul 28 , 2025 | 05:42 AM
బీటెక్‌లో బయో టెక్నాలజీ కోర్సులో మరిన్ని సీట్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): బీటెక్‌లో బయో టెక్నాలజీ కోర్సులో మరిన్ని సీట్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ కోర్సులో రాష్ట్రవ్యాప్తంగా 330 సీట్లే ఉన్నాయి. ఇందులో 273 సీట్లను కన్వీనర్ కోటాలో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సీట్ల సంఖ్య పెంచాలని ఇప్పటికే చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎంటెక్‌లో బయో టెక్నాలజీ సీట్లు ఎక్కువగా ఉన్నాయని, బీటెక్‌లో మాత్రం తక్కువగా ఉన్నాయని తెలిపారు.