Hyderabad Mayor: అలా మాట్లాడకండి..
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:08 PM
పార్లమెంట్ మొదలు.. అసెంబ్లీ అయినా.. ఆఖరికి మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలైనా.. రచ్చరచ్చగానే జరుగుతాయి. నాయకుల మాటలతో సదరు సమావేశాలు దద్దరిల్లిపోతాయి. ఇక జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
హైదరాబాద్, నవంబర్ 25: పార్లమెంట్ మొదలు.. అసెంబ్లీ అయినా.. ఆఖరికి మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలైనా.. రచ్చరచ్చగానే జరుగుతాయి. నాయకుల మాటలతో సదరు సమావేశాలు దద్దరిల్లిపోతాయి. ఇక జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో అంశాలపై డిస్కషన్స్ కంటే.. నేతల మధ్య వాగ్వాదమే ఎక్కువగా జరుగుతుంటుంది. ఈ విషయంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొంత మంది కార్పొరేటర్లు అగౌరవంగా మాట్లాడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కౌన్సిల్ సమావేశంలో మాట్లాడిన ఆమె.. కొంతమంది కార్పొరేటర్లు అగౌరవంగా మాట్లాడుతున్నారంటూ డైరెక్ట్‌గానే ఫైర్ అయ్యారు. కౌన్సిల్‌లో హుందాగా, గౌరవంగా మాట్లాడాలని సభ్యులకు సూచించారు. మేయర్‌ను ‘నువ్వు, నిన్ను, నీతో’ అంటూ ఏకవచనంతో సంభోదించడం ఏంటని ప్రశ్నించారామె.
కౌన్సిల్ సమావేశంలో కొత్త వారికి మాట్లాడే అవకాశం ఇద్దామన్న మేయర్.. మాట్లాడే అవకాశం ఎవరికి ఇవ్వాలో మేయర్‌గా తానే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఎవరికి మైక్ ఇవ్వాలో నాకు ఎవరూ చెప్పాల్సిన అవసం లేదన్నారు. ప్రజలు ఈ సమావేశాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారని.. సభలో అందరూ హుందాగా మెలుగుతూ ఆదర్శంగా నిలవాలని సూచించారామె. ఎవరికి వారు స్వతహాగా మాట్లాడుతారని.. పక్క వాళ్లు డైరెక్షన్లు ఇవ్వడం మానుకోవాలన్నారు. కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లతో మేయర్ ఎంత గౌరవంగా వ్యవహరిస్తారో.. కార్పొరేటర్లు కూడా అంతే గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.
మేయర్, సామల హేమ మధ్య మాటల యుద్ధం..
కౌన్సిల్ సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ మధ్య మాటల యుద్ధం నడించింది. మేయర్ కుర్చీకి గౌరవాన్ని ఎలా ఆశిస్తున్నారో.. కార్పొరేటర్లకు కూడా అదే విధమైన గౌరవం ఇవ్వాలని హేమ విజ్ఞప్తి చేశారు. గతంలో ఆఫ్ట్రాల్ కార్పొరేటర్లు అని మేయర్ సంభోదించారంటూ హేమ గుర్తు చేశారు.
Also Read:
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో 29 నుంచి వర్షాలు..
భారత క్రికెట్ వైపు వేలెత్తడం మానాలి: గావస్కర్