Share News

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల

ABN , Publish Date - Mar 07 , 2025 | 04:36 AM

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా గవ్వల భరత్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు ఎంపీ ఆర్‌.కృష్ణయ్య నియామకపత్రం అందజేశారు.

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల

బర్కత్‌పుర, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా గవ్వల భరత్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు ఎంపీ ఆర్‌.కృష్ణయ్య నియామకపత్రం అందజేశారు. గురువారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.మారేష్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఫలితాలే 2028 ఎన్నికల్లో పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డపై ఎగిరేది కమలం జెండాయేనని, బీసీ ముఖ్యమంత్రి అయి తీరుతాడని అన్నారు. . విద్య, ఉద్యోగ రంగాల్లో కొంత విజయం సాధించామని, రాజ్యాధికారాన్ని సాధించడమే లక్ష్యంగా బీసీలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని కోరారు. నూతన అధ్యక్షుడుగా నియమితులైన గవ్వల భరత్‌కుమార్‌ మాట్లాడుతూ.. బీసీలలో 139 కులాలను కలుపుకుని కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Updated Date - Mar 07 , 2025 | 04:36 AM