Share News

Fishery Development: ‘మత్స్య అభివృద్ధి’ స్కీముపై విచారణ చేపట్టాలి

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:13 AM

రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధి కోసం రూ.1000కోట్లతో ప్రారంభించిన ‘సమీకృత మత్స్య సంపద అభివృద్ధి’ పథకంపై సమగ్ర విచారణ జరిపించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ) కోరింది.

Fishery Development: ‘మత్స్య అభివృద్ధి’ స్కీముపై విచారణ చేపట్టాలి

  • సీఎం రేవంత్‌రెడ్డికి ఎఫ్‌జీజీ లేఖ

హైదరాబాద్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధి కోసం రూ.1000కోట్లతో ప్రారంభించిన ‘సమీకృత మత్స్య సంపద అభివృద్ధి’ పథకంపై సమగ్ర విచారణ జరిపించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ) కోరింది. ఈమేరకు ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో మత్స్య సంపద, మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ఈ స్కీము కింద ఫిష్‌ పాండ్‌లను నిర్మించలేదని, ఎనిమిదేళ్లుగా ప్రైవేటు సంస్థల నుంచి చేప పిల్లలను కొనుగోలు చేయడం వల్ల నాణ్యత లోపించి, ఆశించిన ఫలితాలు రాలేదని తెలిపింది. ఈ స్కీములో లోపాల కారణంగా లబ్ధిదారులకు లాభం లేకుండా పోయిందని, విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది.


ఆర్‌డీసీ ఎండీగా మోహన్‌ నాయక్‌

హైదరాబాద్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పోరేషన్‌(టీజీఆర్‌డీసీ)కు మేనేజింగ్‌ డైరక్టర్‌గా జే.మోహన్‌ నాయక్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్య ప్రత్యేక కార్యదర్శి వికా్‌సరాజ్‌ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖలో రహదారుల చీఫ్‌ ఇంజినీర్‌గా ఉన్న మోహన్‌ నాయక్‌కు ఆర్‌డీసీ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..

Updated Date - Aug 30 , 2025 | 01:13 AM