Heart Attack: హైకోర్టులో గుండెపోటుతో న్యాయవాది మృతి
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:14 AM
హైకోర్టులో విధుల్లో ఉన్న ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన న్యాయవాది, మాజీ స్పెషల్ జీపీ పర్సా అనంత నాగేశ్వర్ రావు(45) గురువారం గుండెపోటుతో మృతిచెందారు.
హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): హైకోర్టులో విధుల్లో ఉన్న ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన న్యాయవాది, మాజీ స్పెషల్ జీపీ పర్సా అనంత నాగేశ్వర్ రావు(45) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఆయన న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, జడ్జిల సెక్యూరిటీ సిబ్బంది చూస్తుండగానే బెంచిపై ఓ పక్కకు ఒరిగిపోతూ ప్రాణాలు కోల్పోయారు.
అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది సీపీఆర్ చేస్తూ.. ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాగేశ్వర్‌రావు మృతి పట్ల హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు.