Nizamabad: అటవీ అధికారులపై దాడి
ABN , Publish Date - Jun 22 , 2025 | 05:12 AM
అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్టు సిబ్బందిపై కొందరు గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
కేసు నమోదు.. పలువురి అరెస్ట్
ధర్పల్లి, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్టు సిబ్బందిపై కొందరు గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ధర్పల్లి మండలం కొటాల్‌పల్లి గ్రామ శివారులోని అటవీ భూమిని శుక్రవారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన కొందరు చదును చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ట్రాక్టర్‌ను సీజ్ చేశారు.
దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అధికారుల కళ్లల్లో కారం చల్లి ట్రాక్టర్‌తో పరారయ్యారు. అటవీ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై అటవీ చట్టం కింద కేసు నమోదు చేశారు. తప్పించుకున్న వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.