Share News

Jurala project: జూరాలకు కొనసాగుతున్న వరద

ABN , Publish Date - Jun 04 , 2025 | 04:53 AM

గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టులో వరద నీరు నిలకడగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది.

Jurala project: జూరాలకు కొనసాగుతున్న వరద

ధరూరు/దోమలపెంట, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగుతోంది. ఎగువన ఆల్మటి జలాశయంలో 54.49 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ఆ దిగువన ఉన్న నారాయణపూర్‌ జలాశయంలో 27.82 టీఎంసీల నీరు ఉంది. జూరాలలో 317.920 మీటర్లలో 4.747 టీఎంసీల నీరు ఉండగా ప్రాజెక్టులో 17 వేల క్యూసెక్కుల వరద వస్తోంది, జూరాల నుంచి 17,885 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 6,685 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడగులకు గాను, 833.20 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 53 టీఎంసీల నీరుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3,982 క్యూసెక్కుల ఆవుట్‌ ఫ్లో కొనసాగుతోందని డ్యాం అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 04:53 AM