Maoists: ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్ మృతి
ABN , Publish Date - Jun 08 , 2025 | 05:16 AM
చనిపోయిన మావోయిస్టులను ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో 5 తుపాకులు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
చర్ల, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. చనిపోయిన మావోయిస్టులను ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో 5 తుపాకులు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మూడ్రోజుల క్రితం నేషనల్‌పార్క్ అడవుల్లో మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలున్నట్లు సమాచారం రావడంతో బీజాపూర్‌కు చెంది న డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ బలగాలు కూబింగ్ ప్రారంభిచాయి. గురవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, శుక్రవారం మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే.. నేషనల్ పార్క్ అడవుల్లోని ఓ గ్రామంలో మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసు లు.. రోజుకు కొందరి చొప్పున మట్టుబెడుతూ.. ఎన్‌కౌంటర్ల పేరుతో బుకాయిస్తున్నారని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. కాగా.. నేషనల్ పార్క్ అడవుల్లో కూంబింగ్ సందర్భంగా బలగాలపై తేనెటీగలు దాడి చేశాయని, ఒకరిద్దరు జవాన్లు తేలుకాటుకు గురయ్యారని తెలుస్తోంది. దీనిపై బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ స్పందిస్తూ.. బలగాలు క్షేమంగా ఉన్నాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..