BRS: బీఆర్‌ఎస్ హయాంలో పత్రికా ప్రకటనల పేరిట నిధుల దుర్వినియోగం
ABN , Publish Date - Jul 12 , 2025 | 04:59 AM
పత్రికా ప్రకటనల పేరిట గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్‌ఫజీజీ) పేర్కొంది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవమంటూ రూ.22.13 కోట్లతో ప్రకటనలు
ఏడాదిలోనే 244.17 కోట్లు ఖర్చు
విచారణ చేపట్టాలని గవర్నర్‌కు ఎఫ్‌జీజీ లేఖ
హైదరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): పత్రికా ప్రకటనల పేరిట గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్‌ఫజీజీ) పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను కోరింది. ఈమేరకు ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి శుక్రవారం గవర్నర్‌కు లేఖ రాశారు. బీఆర్‌ఎస్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.32,000 కోట్లతో పాలనాపరమైన అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. దీనికి పర్యావరణం, ఇతర అనుమతులు లేకపోవడం, జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ రూ.920 కోట్ల అపరాధ రుసుము విధించడం, రకరకాల కోర్టు కేసులు ఉండడంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు చివరి దశకు చేరుతుందా? మధ్యలోనే ఆగిపోతుందా అనే సందేహాలు ఉండేవని పేర్కొన్నారు. అయినా... అప్పటి సీఎం 2023 సెప్టెంబరు 16న నార్లాపూర్‌లో, 17న కొల్లాపూర్‌లో ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారని తెలిపారు.
ఆ సందర్భంగా 13 తెలుగు, 7 ఆంగ్లం, 3 హిందీ, 6 ఉర్దూ, 2 మరాఠి పత్రికలు, 296 ఇతర చిన్న పత్రికలు, 322 మ్యాగజైన్లకు ప్రకటనలు (యాడ్స్) ఇచ్చారని తెలిపారు. ఇందుకోసం రూ.22,13,55,038 ఖర్చు చేశారని వివరించారు. పూర్తి కాని ప్రాజెక్టుకు రూ.22.13 కోట్లను ఖర్చు చేయడం ప్రజాధన దుర్వినియోగమే అవుతుందని ఆక్షేపించారు. 2022లో టీఆర్‌ఎస్ కాస్త బీఆర్‌ఎ్‌సగా మారిందని, ఆ సందర్భంలోనూ భారీగా పత్రికా ప్రకటనలు ఇచ్చారని తెలిపారు. 2023 ఎన్నికలకు ముందు కూడా పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారని వివరించచాఆరు. ప్రకటనల కోసం ఏడాదిలోనే ఏకంగా రూ.244.17కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లోనే కాకుండా మలయాళం, తమిళం, మరాఠి, ఒరియా, గుజరాతి, బెంగాలీ, పంజాబీ భాషా పత్రికలకు ప్రకటనలు ఇచ్చారని ఆరోపించారు. ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ఈ విషయమై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
14న ఎడ్‌సెట్, పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్
బీఈడీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎడ్‌సెట్, వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఈ నెల 14న ప్రకటించనున్నారు. ఎడ్‌సెట్ ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్, ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 21 నుంచి 31 వరకు, పీఈసెట్‌కు ఈ నెల 23 నుంచి 29 వరకు ఉంటుందని ఉన్నత విద్యామండలి ఓ ప్రకటనలో తెలిపింది.