Kavitha: రైతుల ఆందోళన సీఎంకు కనబడటం లేదా?
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:30 AM
అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతులకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతులకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా.. మహబూబ్‌నగర్ జిల్లా వేరుశనగ రైతులు చేస్తున్న ఆందోళన సీఎం రేవంత్‌రెడ్డికి కనబడటం లేదా..? అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. వారిపాలన రైతుల పాలిట శాపంగా మారిందని బుధవారం ఎక్స్ వేదికగా ఆమె విమర్శించారు. ప్రభుత్వం తక్షణం మేల్కొని వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. కాగా, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ఈ నెల 31న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘నీళ్లు.. నిజాలు’ పేరిట రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసింది.