Share News

Telangana: అప్పుల బాధతో పొలంలోనే రైతు ఆత్మహత్య

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:12 AM

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో పత్తి పంట నష్టాలు, అనారోగ్యం, అప్పుల భారంతో రైతు పూలాజిరాం ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.4 లక్షల అప్పులు తీర్చలేక పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Telangana: అప్పుల బాధతో పొలంలోనే రైతు ఆత్మహత్య

ఉట్నూర్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలంలోని శంభుగూడకు చెందిన సెడ్‌మకి పూలాజిరాం (45) అనే రైతు అప్పుల బాధతో సోమవారం అర్ధరాత్రి పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు గ్రామ శివారులో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. గత కొన్నేళ్లుగా పత్తి వేయగా.. సరైన దిగుబడులు రావడంలేదు. దీంతో పాటు కొంత కాలంగా అనారోగ్యం కూడా వెంటాడుతోంది. కుటుంబం గడవడం రోజురోజుకూ భారంగా మారడంతో.. గ్రామంలోని తెలిసిన వ్యక్తుల వద్ద రూ. 4లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు తీర్చాలని ఒత్తిళ్లు రావడంతో తీవ్ర మనోవేదనకు గురయి పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 05:12 AM