Good Conduct on Gandhi Jayanti: అసత్ప్రవర్తన కల జీవిత ఖైదీలకు క్షమాబిక్ష పెట్టండి
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:58 AM
క్షణికావేశంలో చేసిన తప్పుకు యావజ్జీవ ఖైదుననుభవిస్తున్న వారిలో సత్ప్రవర్తన కల వారికి క్షమాభిక్ష ప్రసాదించాలని...
గాంధీ జయంతి నాడు విడుదల చేయండి
సీఎం రేవంత్ రెడ్డికి జీవిత ఖైదీల కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
పంజాగుట్ట, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): క్షణికావేశంలో చేసిన తప్పుకు యావజ్జీవ ఖైదుననుభవిస్తున్న వారిలో సత్ప్రవర్తన కల వారికి క్షమాభిక్ష ప్రసాదించాలని సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి జీవిత ఖైదీల కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. క్షమాభిక్షతో గాంధీ జయంతి నాడు వారిని విడుదల చేసి, తమ జీవితాల్లో వెలుగు ప్రసాదించాలని సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో వేడుకున్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో జీవిత ఖైదీల కుటుంబ సభ్యులు స్వప్న, బీచుపల్లి, ఎం.డి.షరీఫ్, రాజేశ్, అనిల్ కుమార్ తదితరులు మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన తప్పుకు తమ కుటుంబ పెద్దలు, సభ్యులు యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. వారిలో సత్ప్రవర్తనతో జైలు జీవితం గడుపుతున్న వారిలో 60 ఏళ్ల పైబడిన వారు, తమ పనులు తాము చేసుకోలేక.. చేసిన తప్పుకు పశ్చాతాపంతో కుమిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎంతో నష్టపోయిన తమ జీవితాలు దుర్భరమయ్యాయన్నారు. ఖైదీల పరిస్థితి ఒకలా ఉంటే, వారిపై ఆధారపడ్డ వారి పరిస్థితి మరింత దారుణం, దయనీయమైందని వాపోయారు. భర్తకు భార్య, తండ్రికి పిల్లలు, కొడుకు దూరమైన వృద్ధ తల్లిదండ్రులు నరక యాతన అనుభవిస్తున్నట్లు తెలిపారు. మానవతా దృక్పథంతో గాంధీ జయంతి సందర్భంగా తమ వారికి క్షమాభిక్ష ప్రసాదించి, సాధారణ జీవితం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలను క్షమాభిక్షతో విడుదల చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..