Share News

Fraud Case: టిప్పుసుల్తాన్‌ వారసుడినంటూ.. రూ.5.56 కోట్లకు టోకరా

ABN , Publish Date - Mar 04 , 2025 | 05:10 AM

సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనగామ డీసీపీ రాజ మహేంద్రనాయక్‌ వివరాలను వెల్లడించారు. తమిళనాడులోని కంభం ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ రహీం సుల్తాన్‌ రజా ఎంబీబీఎస్‌ పూర్తి చేసినట్లు చెప్పుకొంటూ.. జనగామలో కేకే ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు.

Fraud Case: టిప్పుసుల్తాన్‌ వారసుడినంటూ.. రూ.5.56 కోట్లకు టోకరా

8 నెలలుగా పరారీలో నిందితుడు

అరెస్టు చేసిన జనగామ పోలీసులు

జనగామ రూరల్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): టిప్పుసుల్తాన్‌ వారసుడినంటూ పలువురి వద్ద రూ.5.56 కోట్లకు టోకరా వేసిన ఘరానా మోసగాడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనగామ డీసీపీ రాజ మహేంద్రనాయక్‌ వివరాలను వెల్లడించారు. తమిళనాడులోని కంభం ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ రహీం సుల్తాన్‌ రజా ఎంబీబీఎస్‌ పూర్తి చేసినట్లు చెప్పుకొంటూ.. జనగామలో కేకే ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. తనను తాను టిప్పుసుల్తాన్‌ వారసుడినని రహీం చెప్పుకొనేవారు. టిప్పుసుల్తాన్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నట్లు నమ్మబలికేవారు. కర్ణాటక ప్రభుత్వం ద్వారా ట్రస్ట్‌కు రూ.700 కోట్లను కేటాయించారని, ఆ మొత్తంతో హైదరాబాద్‌లో మెడికల్‌ కాలేజీని నిర్మిస్తానని చెప్పేవారు. అందులో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించారు. ఉద్యోగాల పేరుతో.. వేర్వేరు కారణాలతో జనగామ పట్టణానికి చెందిన ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్‌ వసీం అక్తర్‌ వద్ద రూ.1.17కోట్లు, 2014లో కరీంనగర్‌కు చెందిన సీహెచ్‌ అనిల్‌ వద్ద రూ.2కోట్లు, హైదరాబాద్‌కు చెందిన ఎస్‌వీఎన్‌ చారి అలియాస్‌ ఆచార్య(ఆడిటర్‌) వద్ద రూ.1.70 కోట్లు, రాజు అనే వ్యక్తి వద్ద రూ.50లక్షలు, 2021లో హైదరాబాద్‌ ఈఎ్‌సఎఐ ఆస్పత్రిలో ఉద్యోగాలిప్పిస్తానంటూ జనగామకు చెందిన మేకల ఆనంద్‌కుమార్‌ వద్ద రూ.3.75లక్షలు, గాదెపాక రాజ్‌కుమార్‌ వద్ద నుంచి రూ.5.50 లక్షలు, పిపిరె సిద్ధార్థ వద్ద రూ.5.50లక్షలు, మరో ముగ్గురి నుంచి రూ.14.75లక్షల చొప్పున వసూలు చేశారు. 2023లో ఆస్పత్రిలోని ఎక్స్‌రే మిషన్‌, 10 బెడ్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని తక్కువ ధరకే ఇస్తానంటూ జనగామకు చెందిన మారబోయిన పాండు వద్ద రూ.5లక్షలు తీసుకున్నారు. ఇలా రూ.5.56 కోట్లను కొల్లగొట్టిన రహీం..జనగామ నుంచి ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిది నెలల క్రితం కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం రహీం జనగామకు వచ్చినట్లు సమాచారం అందడంతో.. సీఐ దామోదర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం అతణ్ని అరెస్టు చేసింది.


Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..

Also Read: ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్

For Telangana News And Telugu News..

Updated Date - Mar 04 , 2025 | 05:11 AM