Share News

Etela Rajender: నోటీసులు అందాక స్పందిస్తా

ABN , Publish Date - May 21 , 2025 | 04:08 AM

ఈటల రాజేందర్‌ కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు అందలేదు అని వెల్లడించారు. నోటీసులు వచ్చిన తర్వాత మాత్రమే స్పందిస్తానని ప్రకటించారు.

Etela Rajender: నోటీసులు అందాక స్పందిస్తా

  • నోటీసులు చూడకుండా ఏమీ మాట్లాడలేను: ఎంపీ ఈటల

భువనగిరి టౌన్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. కమిషన్‌ నుంచి తనకు నోటీసులు వస్తే.. ఆ అంశంపై స్పందిస్తానన్నారు. యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రం-- భువనగిరిలో మంగళవారం నిర్వహించిన తిరంగా యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసులపై ప్రశ్నించగా.. ఈటల పైవిధంగా స్పందించారు. తనకు నోటీసులు అందాక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, తన అభిప్రాయాలను చెబుతానన్నారు. నోటీసులను చూడకుండా ఏమీ మాట్లాడలేనని స్పష్టం చేశారు. తిరంగా యాత్ర సందర్భంగా మాట్లాడుతూ భారత్‌ ప్రపంచ శాంతిని కోరుకుంటోందని, భారతీయులకు హాని జరిగితే.. ప్రధాని మోదీ చూస్తూ ఊరుకోబోరని.. గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Updated Date - May 21 , 2025 | 04:09 AM