Share News

Seats Allotted: ఇంజనీరింగ్‌ రెండో విడత

ABN , Publish Date - Jul 30 , 2025 | 04:41 AM

ఇంజనీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ సీట్లను సాంకేతిక విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది. రెండో విడతలో మొత్తం 23509 మందికి సీట్లు కేటాయించారు.

Seats Allotted: ఇంజనీరింగ్‌ రెండో విడత

  • కౌన్సెలింగ్‌లో 23509 మందికి సీట్లు

  • ప్రైవేటులో 92%, యూనివర్సిటీల్లో 80% సీట్ల భర్తీ

  • ఆగస్టు 8 నుంచి చివరి విడత కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ సీట్లను సాంకేతిక విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది. రెండో విడతలో మొత్తం 23509 మందికి సీట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్‌ కోటాలో మొత్తం 91495 సీట్లు ఉండగా.. మొదటి, రెండోవిడతలో మొత్తం 83521 (91.2ు) సీట్లు భర్తీ అయ్యాయని, 7974 సీట్లు మిగిలాయని ఎప్‌సెట్‌ కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 6445 మంది ఈడబ్ల్యుఎస్‌ కోటాలో సీట్లు పొందారు. రెండో విడతలో 6377 మంది ఆప్షన్లు ఇచ్చినా సీటు దక్కలేదు.


మొత్తం 72 ప్రైవేటు కాలేజీలు, 5 వర్సిటీల్లో 100శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రెండు ప్రైవేటు యునివర్సిటీల్లో 1386 సీట్లలో 1380 (99.5%) సీట్లు భర్తీ అయ్యాయి. అలాగే 155 ప్రైవేటు కాలేజీల్లో 83713 సీట్లలో 77158 (92.1%), 20 యునివర్సిటీ కాలేజీల్లో 6198 సీట్లలో 4942 (79.7%), ఒక ప్రభుత్వ కాలేజీలో 198 సీట్లలో 41 (20.7%) సీట్లు భర్తీ అయ్యాయి. సీటు పొందినవారు ఆగస్టు-1లోపు ట్యూషన్‌ ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి, లేదంటే సీటు రద్దవుతుంది. రెండో విడతలో సీటు సాధించినా చేరని విద్యార్థులు చివరి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనలేరు. రెండో విడతలో భర్తీ తర్వాత సీఎ్‌సఈలో 95.42%, ఎలకా్ట్రనిక్స్‌, ఎలక్ట్రికల్‌ 84.96, సివిల్‌, మెకానికల్‌లో 74%, ఇతర విభాగాల్లో 73% సీట్లు భర్తీ అయ్యాయి. ఆగసు 8 నుంచి చివరి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.

Updated Date - Jul 30 , 2025 | 04:41 AM