Share News

Loan Recovery Agents: అరాచకం.. లోన్ కట్టలేదని వృద్ధులను ఇంటి నుంచి గెంటేశారు..

ABN , Publish Date - Nov 07 , 2025 | 09:12 PM

ఆ దంపతులిద్దరూ ఓపిక ఉన్నంత కాలం కష్టపడి పని చేశారు. తమకంటూ ఓ సొంత ఇల్లు కట్టుకున్నారు. కన్న పిల్లలకు పెళ్లి్ళ్లు చేసి వారిని కూడా సెటిల్ చేశారు. వయోభారంతో ఇంటి వద్దే ఉంటూ ..

Loan Recovery Agents: అరాచకం.. లోన్ కట్టలేదని వృద్ధులను ఇంటి నుంచి గెంటేశారు..
loan repayment issue

వేములవాడ, నవంబర్ 7: ఆ దంపతులిద్దరూ ఓపిక ఉన్నంత కాలం కష్టపడి పని చేశారు. తమకంటూ ఓ సొంత ఇల్లు కట్టుకున్నారు. కన్న పిల్లలకు పెళ్లి్ళ్లు చేసి వారిని కూడా సెటిల్ చేశారు. వయోభారంతో ఇంటి వద్దే ఉంటూ మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తున్నారు. కానీ, ఇంతలోనే వారికి ఊహించని పరిణామం ఎదురయ్యింది. కనీసం అప్పు చేయడం కూడా తెలియని ఆ వృద్ధ దంపతులను.. కొందరు ఏకంగా లోన్ కట్టలేదంటూ ఇంట్లో నుంచే గెంటేశారు. ఒకటి కాదు రెండు కాదు.. రూ. 14 లక్షలు లోన్ డబ్బులు చెల్లిస్తేనే మీ ఇంటిని తిరిగి అప్పగిస్తామని ఓ ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్స్ తేల్చి చెప్పారు. ఈ ఊహించని పరిణామంతో షాక్ అయిన ఆ వృద్ధ దంపతులు.. అంత డబ్బు తాము ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతామని వాపోతున్నారు. అసలు లోన్ గురించే తమకు తెలియదని.. తమను డబ్బు కట్టాలని అడగడం ఏంటని వాపోతున్నారు. మరి ఇంతకీ ఆ లోన్ తీసుకుంది ఎవరు..? ఈ లోన్ కోసం వృద్ధులను ఇంట్లోంచి ఎందుకు గెంటేశారు.. పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..


వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామం రాజనగర్ కు చెందిన మల్లారం రాజయ్యకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా చిన్న కుమారుడు ఇల్లును తన పేరు మీదికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఓ ప్రయివేటు కంపెనీలో లోన్ తీసుకొని కొన్ని నెలలు చెల్లించాడు. గత సంవత్సర కాలంగా లోన్ కట్టకపోవడంతో సదరు కంపెనీ వారు నోటీసులు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో కంపెనీ వారు ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వృద్ధులను బయటకి తరిమేసి, సామగ్రిని బయట పడేసి తాళం వేశారు. రూ. 14 లక్షలు కడితేనే ఇంట్లోకి వెళ్తారని ప్రైవేటు కంపెనీ వారు తెలిపారని, అంత డబ్బు ఎక్కడి నుండి తేవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.


వృద్ధ దంపతులు అయిన రాజయ్య-పోచవ్వ, వారి పెద్ద కోడలు సుశీల వేములవాడ రూరల్ పోలిస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. తమ కొడుకు చేసిన పనికి తాము రోడ్డున పడ్డామని, రెండు రోజులుగా ఇంటి ముందే వుంటున్నామని, చలికి తట్టుకోలేకపోతున్నామని బోరున విలపిస్తున్నారు. అయితే సమస్య కోర్టు పరిధిలో ఉండటంతో తాము ఏమి చేయలేమని, న్యాయపరంగా సమస్య పరిష్కరించుకోవాలని వారికి సూచించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ వృద్ధ దంపతులు విలపిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది.


Also Read:

తెలుగు తమ్ముళ్లకి మరో గుడ్‌ న్యూస్.. ఆ కమిటీలపై సీఎం చంద్రబాబు క్లారిటీ..!!

10 మంది పేషంట్లను చంపిన నర్స్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు..

Updated Date - Nov 07 , 2025 | 09:14 PM