Share News

ED Raids: హవాలా ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్న ఈడీ

ABN , Publish Date - Apr 25 , 2025 | 03:55 AM

హవాలా ఆపరేటర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులు కొరడా ఝళిపించారు. గురువారం హైదరాబాద్‌లోని 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు.

ED Raids: హవాలా ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్న ఈడీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): హవాలా ఆపరేటర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులు కొరడా ఝళిపించారు. గురువారం హైదరాబాద్‌లోని 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. పలువురు హవాలా ఆపరేటర్లను తదుపరి విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. మనీలాండరింగ్‌కు సంబంధించి అంది న పక్కా సమాచారంతోనే ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.


రాయదుర్గం పరిధిలోని చిత్రపురి కాలనీలో నివాసముంటున్న ఇద్దరిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని వారివద్ద నుంచి 75 లక్షల రూపాయలతో పాటు కోడ్‌ భాషలో ఉన్న కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Updated Date - Apr 25 , 2025 | 03:55 AM