Share News

Falcon Invoices Scam: ఈడీ కస్టడీకి ‘ఫాల్కన్‌’ నిందితుడు

ABN , Publish Date - Aug 14 , 2025 | 04:34 AM

ఫాల్కన్‌ ఇన్‌వాయి్‌స డిస్కౌంటింగ్‌ స్కామ్‌ కేసులో నిందితుడు సందీ్‌పకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) అధికారులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు.

Falcon Invoices Scam: ఈడీ కస్టడీకి ‘ఫాల్కన్‌’ నిందితుడు

హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఫాల్కన్‌ ఇన్‌వాయి్‌స డిస్కౌంటింగ్‌ స్కామ్‌ కేసులో నిందితుడు సందీ్‌పకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) అధికారులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో అతణ్ని మూడ్రోజులపాటు విచారించనున్నారు. క్యాపిటల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ లిమిటెడ్‌(సీపీఎ్‌ఫఎల్‌) ముసుగులో ఫాల్కన్‌ గ్రూపును నడిపిస్తున్న అమర్‌దీప్‌ కుమార్‌, అతని సోదరుడు సందీప్‌ కుమార్‌ 6,979 మంది నుంచి రూ.1,700 కోట్ల మేర డిపాజిట్లను వసూలు చేశారు. కొంత మందికి డిపాజిట్లను తిరిగి చెల్లించగా.. ఇంకా రూ.792కోట్ల బకాయిలున్నాయి.


దీంతో.. బాధితులు సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు ఆధారంగా రంగంలో దిగిన ఈడీ అధికారులు.. ఈసీఐఆర్‌ నమోదు చేసి ఫాల్కన్‌ గ్రూపుకు సంబంధించిన రూ.18.14కోట్ల ఆస్తులను ఫ్రీజ్‌ చేశారు. సందీ్‌పకుమార్‌ను గత నెల 31న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. రిమాండ్‌లో ఉన్న సందీ్‌పను మనీలాండరింగ్‌ కోణంలో విచారించాల్సి ఉందని పేర్కొంటూ.. కోర్టులో కస్టడీ పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. బుధవారం నుంచి మూడ్రోజుల పాటు సందీ్‌పను ఈడీ కస్టడీకి అప్పగించింది.

Updated Date - Aug 14 , 2025 | 04:34 AM