CM Revanth Reddy: సీఎం రేవంత్‌తో నోరి దత్తాత్రేయుడు భేటీ
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:08 AM
ప్రముఖ ఆంకాలజిస్టు, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఆంకాలజిస్టు, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎంను కలిసి ఆయన మాట్లాడారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని దత్తాత్రేయుడు అభినందించారు.
తెలంగాణలో క్యాన్సర్ కేర్ సిస్టం అభివృద్ధి విషయంలోప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయుడిని సీఎం శాలువ కప్పి జ్ఞాపికతో సత్కరించారు.
ఇవి కూడా చదవండి..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..