Share News

Maipathi Arun Kumar: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి బేషరతుగా తొలగించాలి

ABN , Publish Date - May 19 , 2025 | 04:36 AM

లంబాడీలను వెంటనే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి జాతీయ నాయకుడు డాక్టర్‌ మైపతి అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Maipathi Arun Kumar: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి బేషరతుగా తొలగించాలి

  • ఇల్లెందు మహాగర్జన సభలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి నేతల డిమాండ్‌

ఇల్లెందు, మే 18(ఆంధ్రజ్యోతి): లంబాడీలను వెంటనే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి జాతీయ నాయకుడు డాక్టర్‌ మైపతి అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై రాజకీయ పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని కోరారు. భద్రాద్రి జిల్లా ఇల్లెందులో ఆదివారం తుడుందెబ్బ ఆదివాసీ ఉద్యోగ, విద్యార్థి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ మహాగర్జన సభ నిర్వహించారు.


రాజ్యాంగంలోని ఐదో షెడ్యుల్‌లో లేని లంబాడీలను ఎలా ఎస్టీలుగా కొనసాగిస్తున్నారని మైపతి ప్రశ్నించారు. ఆదివాసీల విద్య, ఉద్యోగ హక్కులను లంబాడీలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆదివాసీ ఎమ్మెల్యే లు, ఎంపీలను కోరారు. ఆదివాసీ ఉద్యోగ సంఘాల నేత పొడియం బాలరాజు, ఉద్యోగ సంఘాల నేతలు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు ఇల్లెందులో భారీర్యాలీ నిర్వహించారు.

Updated Date - May 19 , 2025 | 04:36 AM