Mahbubabad MLA: డిప్యూటీ స్పీకర్‌గా ఎమ్మెల్యే రాంచందర్‌నాయక్
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:55 AM
వృత్తిరీత్యా వైద్యుడైన రాంచందర్‌నాయక్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్‌పై ఘన విజయం సాధించి తొలిసారి చట్టసభలో అడుగుపెట్టారు.
2023లో తొలిసారిగా చట్టసభలో అడుగు
మహబూబాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచందర్‌నాయక్‌ను శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. వృత్తిరీత్యా వైద్యుడైన రాంచందర్‌నాయక్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్‌పై ఘన విజయం సాధించి తొలిసారి చట్టసభలో అడుగుపెట్టారు. 18 నెలలుగా ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్న రాంచందర్‌నాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం.. మహబూబాబాద్ జిల్లాకు దక్కిన గౌరవమని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్లు సర్పంచ్‌తండాకు చెందిన జాటోతు రాంచందర్‌నాయక్ ఉస్మానియా నుంచి ఎంబీబీఎ్‌సతో పాటు ఎంఎస్ సర్జన్ పట్టాలు పొందారు. సూర్యాపేటలో శివసాయి ఆస్పత్రి స్థాపించి, వైద్య సేవలందించారు. రాంచందర్‌నాయక్ సతీమణి ప్రమీల కూడా వైద్యురాలే. ఆమె గైనకాలజిస్టుగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. వైద్యుడిగా కొనసాగుతుండగా.. టీడీపీ అనుబంధ ఆరోగ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాంచందర్ నాయక్ 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున డోర్నకల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. 2023లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News