వీఐటీ వ్యవస్థాపకుడు.. విశ్వనాథన్‌కు అమెరికా వర్సిటీ డాక్టరేట్
ABN , Publish Date - May 11 , 2025 | 04:49 AM
శుక్రవారం న్యూయార్క్‌లోని ఆర్‌ఐటీలో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ డేవిడ్ సి.మున్సన్, ఉపాధ్యక్షుడు డాక్టర్ ప్రభు డేవిడ్.. విశ్వనాథన్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందించి సత్కరించారు.

చెన్నై, మే 10 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ విద్య విస్తరణలో విశేష సేవలందించినందుకుగాను ‘వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ) వ్యవస్థాపకులు, చాన్స్‌లర్ డాక్టర్ జి.విశ్వనాథన్‌కు అమెరికాలోని రోచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆర్‌ఐటీ) గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. శుక్రవారం న్యూయార్క్‌లోని ఆర్‌ఐటీలో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ డేవిడ్ సి.మున్సన్, ఉపాధ్యక్షుడు డాక్టర్ ప్రభు డేవిడ్.. విశ్వనాథన్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందించి సత్కరించారు. ఈ సందర్భంగా విశ్వనాథన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షుడు శంకర్ విశ్వనాథన్, డాక్టర్ శేఖర్ విశ్వనాథన్, వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ కాంచన భాస్కరన్, అంతర్జాతీయ సంబంధాల డైరెక్టర్ డాక్టర్ ఆర్.శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా విశ్వనాథన్ అమెరికాకు చెందిన మూడు ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. 2009లో వెస్ట్ వర్జీనియా వర్సిటీ, 2024లో స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ గౌరవ డాక్టరేట్లు ఇవ్వగా, తాజాగా ఆర్‌ఐటీ మరో డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.