Admission Deadline: అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:00 AM
డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ గడువును పెంచారు.
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ గడువును పెంచారు. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీలతో పాటు పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి చివరి తేదీ ఆగస్టు 30 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం హెల్ప్ డెస్క్ నంబర్లు 040-23680222/ 333/444/555, టోల్‌ఫ్రీ నెంబర్. 18005990101లో సంప్రదించొచ్చని లేదా www.braouonline.in. www.braou.ac.in వెబ్‌సైట్ సందర్శించాలని రిజిస్ట్రార్ సూచించారు.