Share News

Degree Admissions: నేటి నుంచి ‘దోస్త్‌’ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:49 AM

డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్‌ ప్రత్యేక విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. రిజిస్ర్టేషన్‌, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఈనెల 31వరకు కొనసాగుతుందని దోస్త్‌ కన్వీనర్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి తెలిపారు.

Degree Admissions: నేటి నుంచి ‘దోస్త్‌’ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్‌ ప్రత్యేక విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. రిజిస్ర్టేషన్‌, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఈనెల 31వరకు కొనసాగుతుందని దోస్త్‌ కన్వీనర్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి తెలిపారు. దివ్యాంగులు, ఎన్‌సీసీ, క్రీడల విభాగం దరఖాస్తుదారులకు సంబంధించి ప్రత్యేక విభాగం విద్యార్థుల ధ్రువీకరణపత్రాల పరిశీలన ఈ నెల 31న ఉంటుందని, ఆగస్టు 3న జాబితా విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే దోస్త్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకుని సీటు సాధించని విద్యార్థులు శుక్రవారం నుంచి జరగనున్న ప్రత్యేక కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని, ఇప్పటివరకు రిజిస్ర్టేషన్‌ చేయనివారు రూ.400 చెల్లించి చేసుకోవచ్చన్నారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు సీటు ఖరారు కోసం ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని బాలకిష్ట్టారెడ్డి కోరారు. అలాగే అన్ని ప్రైవేటు, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆగస్టు 11, 12న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని, ఇందులో నాన్‌ లోకల్‌ విద్యార్థులందరికీ అవకాశం ఇస్తామన్నారు.


ఆగస్టు 3న టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ పరీక్షలు

టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ లోయర్‌ గ్రేడ్‌ థియరీ పరీక్షలు ఆగస్టు 3న నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు గురువారం తెలిపారు. 3న ఈ పరీక్షల పేపర్‌-1.. ఎడ్యుకేషనల్‌ సైకాలజీ అండ్‌ స్కూల్‌ అడ్మినిస్ర్టేషన్‌ ఉదయం 11 గంట నుంచి ఒంటి గంట వరకు, పేపర్‌-2.. మెథడ్స్‌ ఆఫ్‌ టీచింగ్‌ జనరల్‌ మధ్యాహ్నం 2 గంట నుంచి 3, పేపర్‌-3.. మెథడ్స్‌ ఆఫ్‌ టీచింగ్‌ స్పెషల్‌ 3.30 గంటల నుంచి 4.30 వరకు ఉంటుందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:49 AM