DK Aruna: జాతీయ మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా డీకే అరుణ
ABN , Publish Date - Apr 27 , 2025 | 04:56 AM
బీజేపీ ఉపాధ్యక్షురాలు మరియు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ జాతీయ మహిళా సాధికారత కమిటీకి సభ్యురాలిగా నియమితులయ్యారు. 30 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో చైర్మెన్‌గా కేంద్ర మంత్రి పురందేశ్వరి వ్యవహరిస్తున్నారు
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): జాతీయ మహిళా సాధికారత కమిటీలో సభ్యురాలిగా బీజేపీ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం అధికారక ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 30 మంది సభ్యులతో జాతీయ మహిళా సాధికారత కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ చైర్మెన్‌గా కేంద్ర మంత్రి పురందేశ్వరి వ్యవహరిస్తున్నారు. తెలంగాణ నుంచి డీకేఅరుణ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి అరుణ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
Read Latest Telangana News And Telugu News