Rush At Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి ప్రాంగణంలోకి దూసుకొచ్చిన భక్తజనం
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:55 PM
ముఖ్యమంత్రి బడా గణేష్ దగ్గరినుంచి వెళ్లిపోగానే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భక్తులు ఒక్కసారిగా వినాయకుడి ప్రాంగణంలోకి దూసుకు వచ్చారు.
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి శరావేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు(శనివారం) మహా గణపతి శోభాయాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలో నిన్న(గురువారం) రాత్రి నుంచే భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు. దర్శనం నిలిపి వేసినా భక్తులు మాత్రం తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. శుక్రవారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడా గణేష్‌ను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ప్రారంభమై 71 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు.
ఇన్నేళ్ల పాటు ఎన్ని కష్టాలు వచ్చినా.. నష్టాలు వచ్చినా అన్నింటిని భరించుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ కమిటీలోని ప్రతి ఒక్కరినీ ముఖ్యమంత్రి అభినందించారు. ముఖ్యమంత్రి బడా గణేష్ దగ్గరినుంచి వెళ్లిపోగానే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భక్తులు ఒక్కసారిగా వినాయకుడి ప్రాంగణంలోకి దూసుకు వచ్చారు. భారీ సంఖ్యలో భక్తులు దూసుకురావటంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. భక్తుల తాకిడితో మహా గణపతి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తుల తాకిడి కారణంగా తొలగింపు పనులు మరింత ఆలస్యం అవ్వనున్నాయి.
ఇవి కూడా చదవండి
పెంపుడు శునకాలకు మైక్రో చిప్..
లేదులేదు.. ఆయన్ని నేనేం విమర్శించలేదు..