Share News

Dasoju Shravan Criticizes: రేవంత్‌కు కోర్టులంటే గౌరవంలేదు

ABN , Publish Date - Aug 26 , 2025 | 03:25 AM

కోర్టు పరిధిలోని అంశాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఇష్టాను సారం మాట్లాడడం సరికాదని, ఆయనకు కోర్టులన్నా.

Dasoju Shravan Criticizes: రేవంత్‌కు కోర్టులంటే గౌరవంలేదు

కోర్టు పరిధిలోని అంశాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఇష్టాను సారం మాట్లాడడం సరికాదని, ఆయనకు కోర్టులన్నా.. కోర్టు తీర్పులన్నా.. గౌరవంలేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. కోదండరామ్‌ గొంతు కోశామంటూ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో సీఎం చేసిన వ్యాఖ్యలను దాసోజు శ్రవణ్‌ ఖండించారు. తీర్పు వచ్చేవరకు ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్‌ చేయమని కోర్టుకు చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఆ వెంటనే కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ను నామినేట్‌ చేయగానే గవర్నర్‌ ఆమోదించడం అన్యాయం కాదా? అని ప్రశ్నించారు. దీనిపై తాము సుప్రీం కోర్టుకు వెల్లడం తప్పెలా అవుతుందో రేవంత్‌ రెడ్డి చెప్పాలన్నారు. కోదండ రామ్‌ పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న రేవంత్‌రెడ్డి.. నిజంగానే ఆయనపై గౌరవం ఉంటే తన పదవి నుంచి దిగిపోయి ఆయన్ను సీఎం చేయాలని డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ

ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 03:25 AM